
Honor Robot Phoneను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లో ప్రత్యేకమైన పాప్-అవుట్ రొటేటింగ్ గింబల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో పై భాగంలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్‌ను అమర్చారు. ట్రైపాడ్ అవసరం లేకుండానే హ్యాండ్స్-ఫ్రీగా వీడియోలు రికార్డ్ చేసుకునేలా ఈ కెమెరా పనిచేస్తుంది. అంతేకాకుండా AI టెక్నాలజీ సాయంతో వీడియోలోని వ్యక్తిని ఎప్పటికప్పుడు ఫ్రేమ్‌లో ఉంచుతుంది.
హానర్ రోబోట్ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 16GB RAM, 1TB స్టోరేజ్‌తో వస్తుంది. పవర్ కోసం భారీ 7,060mAh బ్యాటరీ ఉంది.
ఈ బ్యాటరీకి 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.
హానర్ తొలిసారిగా తన రోబోట్ ఫోన్ కాన్సెప్ట్‌ను గత ఏడాది టీజ్ చేసింది. అనంతరం ఈ ఏడాది జరిగిన MWC 2026లో ఈ ప్రత్యేకమైన ఫోన్‌ను ప్రదర్శించింది.
ఇప్పుడు చైనా మార్కెట్లో దీన్ని అధికారికంగా విడుదల చేసింది.
హానర్ రోబోట్ ఫోన్ ధర
చైనాలో హానర్ రోబోట్ ఫోన్ ధర CNY 9,999 (సుమారు రూ.1,41,000)గా ఉంది. ఈ ధరకు 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది.
ఇక టాప్-ఎండ్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర CNY 12,999 (సుమారు రూ.1,83,000).
ఈ ఫోన్ Moon Shadow Grey, Star Trail Silver కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
హానర్ రోబోట్ ఫోన్ స్పెసిఫికేషన్స్
హానర్ రోబోట్ ఫోన్ డ్యూయల్-సిమ్ (Nano) సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ MagicOS 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఇందులో 6.31-అంగుళాల OLED డిస్ప్లే ఉంది. ఇది 1,216 × 2,640 పిక్సెల్స్ రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీ, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
డిస్ప్లే గరిష్ఠంగా 6,800 నిట్స్ HDR బ్రైట్నెస్ అందిస్తుందని Honor చెబుతోంది.
పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 840 GPU ఉంది. ఈ ఫోన్లో 16GB LPDDR5X RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.
హానర్ రోబోట్ ఫోన్ కెమెరా
హానర్ రోబోట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ప్రధాన కెమెరాగా 200 మెగాపిక్సెల్ 1/1.28-అంగుళాల CMOS సెన్సార్ ఉంది.
ఇది f/1.6 అపెర్చర్, 23mm సమాన ఫోకల్ లెంగ్త్‌తో పాటు గింబల్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్‌లో మరో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. ఇది 2.7x ఆప్టికల్ జూమ్, గరిష్ఠంగా 200x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఇక మూడో కెమెరాగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను ఇచ్చారు. ఇది 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది.
హానర్ రోబోట్ ఫోన్ ఫ్రంట్ కెమెరా, గింబల్ ఫీచర్లు
హానర్ రోబోట్ ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 90 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో గరిష్ఠంగా 4K వీడియోలను 60fps వద్ద రికార్డ్ చేయవచ్చు.
వెనుక కెమెరా సిస్టమ్ ద్వారా 4K వీడియో-ను 120fps వరకు రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ ఫోన్లో పై-భాగంలో ప్రత్యేకంగా రోబోటిక్ గింబల్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ కెమెరా మాడ్యూల్ తిరుగుతూ సబ్జెక్ట్‌ను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది.
ఇందులో త్రీ-యాక్సిస్ మెకానికల్ గింబల్ స్టెబిలైజేషన్‌తో పాటు AI ఆధారిత ఇంటెలిజెంట్ సబ్జెక్ట్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది.
ఈ ప్రత్యేకమైన డివైస్‌ను అభివృద్ధి చేయడానికి హానర్, ARRIతో భాగస్వామ్యం చేసుకుంది.
హానర్ రోబోట్ ఫోన్ కనెక్టివిటీ, బ్యాటరీ, ఇతర ఫీచర్లు
హానర్ రోబోట్ ఫోన్ లో కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi 7, Bluetooth 6.0, NFC, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి.
నావిగేషన్ కోసం GPS, NavIC, Galileo, GLONASS సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ కూడా అందించారు.
ఆడియో కోసం ఫోన్లో స్టీరియో స్పీకర్లు, AI నాయిస్ రిడక్షన్‌కు సపోర్ట్ చేసే నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
ఇతర సెన్సర్లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, హాల్ సెన్సార్, అలాగే X-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉన్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, హానర్ రోబోట్ ఫోన్ లో భారీ 7,060mAh బ్యాటరీ ఉంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, అలాగే వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కొలతల విషయానికి వస్తే ఈ ఫోన్ 151.43 × 72.86 × 9.59 మిల్లీమీటర్లుగా ఉంటుంది. దీని బరువు సుమారు 248 గ్రాములు.













good