OnePlus Nord Buds 4 Pro – Basic Specifications:-
బేసిక్ స్పెసిఫికేషన్:-
ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో (OnePlus Nord Buds 4 Pro) బేసిక్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఇయర్‌బడ్స్ రెండు స్టైలిష్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. రేడియంట్ గ్రాయ్, రావెన్ బ్లాక్ (Radiant Gray, Raven Black) అంటే ప్రీమియం మరియు మోడర్న్ లుక్‌తో డిజైన్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఇంకా డైమెన్షన్స్ (Dimensions) విషయానికి వస్తే ఇయర్ బడ్స్ సైజ్ : 31mm × 20mm × 17.52mm. ఛార్జింగ్ కేస్ సైజ్: 60.00mm × 49.64mm × 25.04mm. ఇక వెయిట్ విషయానికి వస్తే, ఒక్కో ఇయర్ బడ్ బరువు సుమారుగా 4.4 గ్రాములు మాత్రమే. అంటే ఎక్కువసేపు ఉపయోగించినా చెవిలో ఎక్కువ బరువుగా అనిపించకుండా కంఫర్ట్‌గా ఉండే అవకాశం ఉంది. ఛార్జింగ్ కేస్ బరువు సుమారుగా 34.2 గ్రాములు. దీంతో కేస్‌ను జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా క్యారీ చేయవచ్చు. మొత్తం ఇయర్ బడ్స్ మరియు కేస్ కలిపి 43 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అంటే ఇది చాలా పోర్టబుల్ మరియు డైలీ యూజ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.
ఆడియో స్పెసిఫికేషన్:-
ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ ఇయర్‌బడ్స్ పవర్‌ఫుల్ సౌండ్ ఎక్స్‌పీరియెన్స్ మరియు. ఇందులో 12mm డైనమిక్ డ్రైవర్స్ ఇచ్చారు. దీంతో బాస్, వోకల్స్ మరియు మ్యూజిక్ క్లారిటీ ఉంది. ఫ్రీక్యూన్సీ రెస్పాన్స్ (Frequency Response) 20Hz నుంచి 40kHz వరకు ఉండటంతో లో బాస్ నుంచి హై ట్రెబుల్ వరకు మంచి ఆడియో డీటైల్స్ వినిపించే అవకాశం ఉంది. డ్రైవర్ సేన్సిటివిటి 122dB ఉండటం వల్ల సౌండ్ చాలా క్లియర్‌గా మరియు పవర్‌ఫుల్‌గా వినిపిస్తుంది. మైక్రోఫోన్ సేన్సిటివిటి 38dB గా ఉంది. దీంతో కాల్స్ సమయంలో వాయిస్ క్యాప్చర్ మరింత క్లియర్‌గా ఉండే అవకాశం ఉంది. దీంతో Noise Cancellation మరియు కాల్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది.
బ్యాటరీ & ఛార్జింగ్:-
ఇక బ్యాటరీ మరియు ఛార్జింగ్ విషయానికి వస్తే. ఇయర్ బడ్స్ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే, ప్రతి ఇయర్ బడ్ లో 62mAh బ్యాటరీ ఇచ్చారు. ఛార్జింగ్ కేస్ లో 530mAh భారీ బ్యాటరీ ఉంది. దీంతో పలుమార్లు ఇయర్ బడ్స్ ను రీచార్జ్ చేయవచ్చు. మ్యూజిక్ ప్లేబాక్ టైం విషయానికి వస్తే, AAC Mode, ANC OFF మరియు 50% వాల్యూం వద్ద ఇయర్ బడ్స్ + కేస్ కలిపి మొత్తం 54 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించే అవకాశం ఉంది. అంటే లాంగ్ ట్రావెల్స్ మరియు డైలీ యూజ్ కోసం మంచి బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇయర్ బడ్స్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారుగా 60 నిమిషాలు పడుతుంది. ఇయర్ బడ్స్ + ఛార్జింగ్ కేస్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారుగా 90 నిమిషాలు పడుతుంది. ఛార్జింగ్ ఇంటర్ఫేస్ కోసం Type-C పోర్ట్ ఇచ్చారు. అంటే ఫాస్ట్ మరియు కన్వీనియెంట్ ఛార్జింగ్ అనుభవం లభిస్తుంది.
కనెక్టివిటీ:-
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఇయర్‌బడ్స్ లేటెస్ట్ వైర్‌లెస్ టెక్నాలజీలతో వస్తున్నాయి.బ్లూటూత్ కనెక్టివిటీ కోడెక్ విషయానికి వస్తే, ఇవి LHDC 5.0, AAC మరియు SBC కోడెక్స్‌ను సపోర్ట్ చేస్తాయి. దీంతో హై క్వాలిటీ వైర్‌లెస్ ఆడియో అనుభవం పొందవచ్చు. బ్లూటూత్ వెర్షన్ 6.0 సపోర్ట్ ఉండటంతో కనెక్షన్ మరింత ఫాస్ట్‌గా మరియు స్టేబుల్‌గా ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ సుమారుగా 10 మీటర్ల వరకు ఉంటుంది. అంటే కొంత దూరంలో ఉన్నా కనెక్షన్ సరిగ్గా పనిచేస్తుంది.గూగుల్ ఫాస్ట్ ఫైర్ సపోర్ట్ ఉండటంతో ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో చాలా త్వరగా కనెక్ట్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ ఫైర్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో విండోస్ ల్యాప్‌టాప్‌లతో కూడా ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. అలాగే డ్యూయల్-డివైస్ కనెక్షన్ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రెండు డివైసులకు కనెక్ట్ చేయవచ్చు. అంటే ఫోన్ మరియు ల్యాప్‌టాప్ మధ్య ఈజీగా స్విచ్ అవ్వొచ్చు.
స్పెషల్ ఫీచర్స్:-
ఇక స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఇయర్‌బడ్స్ ప్రీమియం ఆడియో మరియు స్మార్ట్ AI ఫీచర్స్‌తో వస్తున్నాయి. ఇందులో ప్రో-లెవెల్, రియల్-టైం యాక్టీవ్ నాయిస్ క్యాన్సల్ల్యేషన్ సపోర్ట్ ఉంది. దీంతో బయట ఉన్న నాయిస్‌ను తగ్గించి మ్యూజిక్ మరియు కాల్స్‌ను మరింత క్లియర్‌గా వినవచ్చు. 6-mic AI Clear Call Noise Cancellation కూడా ఉంది. అంటే కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గి వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. బేస్ వేవ్ టెక్నాలజీ వల్ల బాస్ మరింత డీప్‌గా మరియు పవర్‌ఫుల్‌గా వినిపించే అవకాశం ఉంది.
అలాగే OnePlus Game Sound Spatial Audio ద్వారా గేమింగ్ సమయంలో డైరెక్షనల్ సౌండ్ మరింత రియలిస్టిక్‌గా వినిపిస్తుంది. వాల్యూం స్వైప్ కంట్రోల్ మరియు టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇయర్‌బడ్స్‌పైనే మ్యూజిక్ మరియు కాల్స్‌ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు.AI Translation ఫీచర్ కూడా ఇందులో ఉంది. అంటే భాషా అనువాదంలో ఇది సహాయపడే అవకాశం ఉంది. AI Assistant సపోర్ట్ ఉండటంతో వాయిస్ కమాండ్స్ ద్వారా ఫీచర్స్‌ను ఉపయోగించవచ్చు. అలాగే IP55 Dust & Water Resistance రేటింగ్ కూడా ఉంది. అంటే చెమట, నీటి చినుకులు మరియు ధూళి నుంచి మంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఇన్ బాక్స్:- (In Box)
ఇక Box లో ఏమేమి వస్తాయో చూస్తే —
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ – 1 పెయిర్
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఛార్జింగ్ కేస్ – 1
ఇయర్ టిప్స్ (S, M, L Sizes)
M Size ముందుగానే అమర్చినట్టుగా వస్తుంది.
USB టైపు-సి (Type-C) Charging Cable — 1
User Manual, Safety & Warranty Guide — 1
వన్ ప్లస్ బ్రాండ్ స్టికర్ – 1
అంటే బాక్స్‌లోనే అవసరమైన అన్ని ముఖ్యమైన యాక్సెసరీస్ ఇవ్వడం మంచి విషయం అని చెప్పొచ్చు.
