Moto G37 Power స్పెసిఫికేషన్స్:-
Moto G37 Power Color, Dispaly, Design:-
Moto G37 Power 5G specifications, battery, camera & features in Telugu | మోటో G37 పవర్ పూర్తి వివరాలు
ఇప్పుడు Moto G37 Power స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Colors విషయానికి వస్తే, ఈ ఫోన్ మూడు స్టైలిష్ PANTONE కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. PANTONE Nautical Blue, PANTONE Impenetrable, PANTONE Capri అంటే ప్రతి కలర్ కూడా మోడర్న్ మరియు ప్రీమియం లుక్ ఇచ్చేలా డిజైన్ చేశారు. Display విషయానికి వస్తే, ఇందులో 16.94 సెంటీమీటర్ల పెద్ద డిస్‌ప్లే ఇచ్చారు. Resolution HD+ 1604 × 720 పిక్సెల్స్‌గా ఉంది. Pixel Density 264ppi ఉండటంతో టెక్స్ట్ మరియు ఇమేజెస్ మంచి క్లారిటీతో కనిపిస్తాయి. Display Technology విషయానికి వస్తే, ఇది LCD 8-bit ప్యానెల్‌తో వస్తుంది. Refresh Rate Up to 120Hz వరకు సపోర్ట్ చేస్తుంది. Touch Sampling Rate కూడా 120Hz ఉండటంతో టచ్ రెస్పాన్స్ వేగంగా ఉంటుంది. High Brightness Modeలో 1050 nits వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. Aspect Ratio 20:9 తో వస్తుంది. ఇక Design విషయానికి వస్తే, మంచి డ్యూరబిలిటీ కూడా అందించేలా కనిపిస్తోంది. Dimensions విషయానికి వస్తే:- Height : 166.23mm, Width : 76.50mm, Thickness : 8.89mm అంటే ఫోన్ చేతిలో కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలా స్లిమ్ డిజైన్‌తో రూపొందించారు. Weight విషయానికి వస్తే, ఇది 215 గ్రాములు. Body Design విషయానికి వస్తే, వెనుక భాగంలో PMMA లేదా Vegan Leather Finish ఇచ్చారు. దీంతో ఫోన్‌కు ప్రీమియం మరియు స్టైలిష్ లుక్ వస్తుంది. Frame కోసం Plastic మెటీరియల్ ఉపయోగించారు. Front Protection కోసం Corning Gorilla Glass 7i ఇచ్చారు. Ports విషయానికి వస్తే, ఇందులో USB Type-C 2.0 పోర్ట్ ఇచ్చారు. Water Protection విషయానికి వస్తే, ఇది IP64 Water-resistant డిజైన్‌తో వస్తుంది. Water Touch ఫీచర్ ఉండటంతో చేతులు కొద్దిగా తడిగా ఉన్నా టచ్ సరిగ్గా పని చేసే అవకాశం ఉంది.
Performance & processor స్పెసిఫికేషన్స్:-
ఇక Performance విషయానికి వస్తే, ఈ ఫోన్ Android 16 పై రన్ అవుతుంది. Sensors విషయానికి వస్తే, Accelerometer, Gyroscope, Proximity Sensor, Ambient Light Sensor, Sensor Hub. Fingerprint Reader సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఫోన్‌ను త్వరగా మరియు సురక్షితంగా అన్‌లాక్ చేయవచ్చు. SAR Sensor కూడా ఇందులో ఉంది. ఇది రేడియేషన్ మానిటరింగ్‌కు సంబంధించిన సెన్సర్. అలాగే E-compass సపోర్ట్ ఉండటంతో మ్యాప్స్ మరియు నావిగేషన్ మరింత అక్యురేట్‌గా పని చేస్తాయి.ఇక Processor విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 6nm టెక్నాలజీపై తయారైన చిప్‌సెట్ కావడంతో పవర్ ఎఫిషియెన్సీ మరియు పనితీరు మధ్య మంచి బ్యాలెన్స్ ఇవ్వగలదు. ఇందులో 2.5GHz Octa-core CPU ఇచ్చారు. Graphics కోసం Arm Mali-G57 MP2 GPU ఉపయోగించారు. ఇక Security విషయానికి వస్తే, Side Fingerprint Reader సపోర్ట్ ఉంది. Face Unlock ఫీచర్ కూడా ఉంది. ThinkShield for Mobile సెక్యూరిటీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇది Motorola అందించే అదనపు సెక్యూరిటీ లేయర్ కావడంతో డేటా ప్రొటెక్షన్ మరింత మెరుగ్గా ఉంటుంది.
Ram & Stroge స్పెసిఫికేషన్స్:-
ఇక Storage మరియు RAM విషయానికి వస్తే. ఇందులో 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. అలాగే microSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. RAM విషయానికి వస్తే, ఇది 4GB మరియు 8GB LPDDR4X RAM వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. RAM Boost ఫీచర్ ద్వారా RAMను వర్చువల్‌గా 12GB వరకు పెంచుకోవచ్చు. ఇక Battery విషయానికి వస్తే, ఇందులో 7000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. Rated Capacity 6790mAh గా ఉంది. Charging విషయానికి వస్తే, ఇది 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 6W Reverse Charging ఫీచర్ కూడా ఉంది. Battery Life విషయానికి వస్తే, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారుగా 62 గంటల వరకు బ్యాకప్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది.
Camer స్పెసిఫికేషన్స్:-
Main Camer స్పెసిఫికేషన్స్:-
ఇక Main Camera విషయానికి వస్తే, ఇందులో 50MP ప్రధాన కెమెరా ఇచ్చారు. ఇక Rear Camera Software విషయానికి వస్తే, Night Vision Mode, Portrait Mode, Panorama Mode, Pro Mode with Long Exposure, HDR, Adobe Scan. Camera 2 విషయానికి వస్తే, ఇందులో 2-in-1 Light Sensor ఇచ్చారు. ఇది Ambient Light Sensor మరియు Flicker Detector, Ambient Light Sensor ద్వారా చుట్టూ ఉన్న వెలుతురు ఆధారంగా కెమెరా సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి. Flicker Detector వల్ల ట్యూబ్‌లైట్స్ లేదా ఇతర లైటింగ్ కారణంగా వచ్చే ఫ్లికర్ ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. Camera 3 విషయానికి వస్తే, ఇందులో అదనపు మూడో కెమెరా లేదు. అంటే N/A గా పేర్కొన్నారు. ఇక Rear Camera Video Features విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ కోసం అనేక క్రియేటివ్ ఫీచర్స్ ఇచ్చారు. Dual Capture ఫీచర్ ద్వారా ముందు మరియు వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేయవచ్చు. అంటే వ్లాగింగ్ మరియు రియాక్షన్ వీడియోస్‌కు ఇది ఉపయోగపడుతుంది. Timelapse మరియు Hyperlapse Modes సపోర్ట్ కూడా ఉన్నాయి. Slow Motion Mode ద్వారా HD Resolutionలో 120fps వరకు వీడియోలు రికార్డ్ చేయవచ్చు. High-res Digital Zoom ద్వారా 6x వరకు జూమ్ చేయవచ్చు. దీంతో కొంచెం దూరంలో ఉన్న సబ్జెక్ట్స్‌ను కూడా క్యాప్చర్ చేయవచ్చు. అలాగే EIS అంటే Electronic Image Stabilization సపోర్ట్ కూడా ఉంది. దీంతో వీడియోలు కొంతవరకు షేక్ తగ్గి స్టేబుల్‌గా కనిపించే అవకాశం ఉంది. ఇక Rear Camera Video Recording విషయానికి వస్తే, Rear Main Camera ద్వారా 2K వీడియోలను 30fpsలో రికార్డ్ చేయవచ్చు. అలాగే Full HD అంటే FHD వీడియోలను 30fps మరియు 60fpsలో రికార్డ్ చేయవచ్చు. ముఖ్యంగా 60fps సపోర్ట్ ఉండటంతో వీడియోలు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. ఇక Artificial Intelligence Features విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో కొన్ని స్మార్ట్ AI కెమెరా ఫీచర్స్ ఇచ్చారు. Shot Optimizatio, Auto Smile Capture, Google Lens Integration కూడా ఇందులో ఉంది. దీంతో టెక్స్ట్ ట్రాన్స్‌లేట్ చేయడం, వస్తువులను గుర్తించడం, QR కోడ్స్ స్కాన్ చేయడం మరియు సమాచారం సెర్చ్ చేయడం సులభంగా చేయవచ్చు. Selfie Stick Support, Google Photos AI Editing Features, Magic Eraser. Photo Unblur, Reimagine, Auto Frame Portrait Blur మరియు Portrait Light, Sky Effects, Color Pop, Cinematic Photos ని కూడా ఉపయోగించవచ్చు. ఇక Flash విషయానికి వస్తే, ఇందులో LED Flash సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల రాత్రి సమయంలో లేదా ఇండోర్‌లో ఫోటోలు తీసేటప్పుడు అదనపు లైట్ అందిస్తుంది.
Fornt Camera స్పెసిఫికేషన్స్:-
ఇక front Camera విషయానికి వస్తే, ఇందులో 8MP Front Camera ఇచ్చారు. Secondary Camera Features విషయానికి వస్తే Night Vision Mode, Portrait Mode, Pro Mode with Long Exposure సపోర్ట్ కూడా ఉంది. Photo Booth ఫీచర్ ద్వారా వరుసగా అనేక సెల్ఫీలు ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేయవచ్చు. Auto Smile Capture, HDR, Selfie Animation ఫీచర్ కూడా పొందవచ్చు. ఇక Front Camera Software విషయానికి వస్తే, Night Vision Mode, HDR, Portrait Mode, Pro Mode with Long Exposure సపోర్ట్ కూడా ఉంది. Photo Booth ఫీచర్ ద్వారా వరుసగా అనేక సెల్ఫీలు ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేయవచ్చు. ఇక Front Camera Video Recording విషయానికి వస్తే, ఈ ఫోన్ సెల్ఫీ వీడియోస్ మరియు వీడియో కాల్స్ కోసం మంచి రికార్డింగ్ ఆప్షన్స్‌తో వస్తోంది. Front Camera ద్వారా 2K వీడియోలను 30fpsలో రికార్డ్ చేయవచ్చు. అంటే సెల్ఫీ వీడియోలు మంచి క్లారిటీ మరియు డీటైల్‌తో కనిపించే అవకాశం ఉంది. అలాగే Full HD అంటే FHD వీడియోలను కూడా 30fpsలో రికార్డ్ చేయవచ్చు. దీంతో సోషల్ మీడియా వీడియోస్ మరియు వీడియో కాల్స్‌కు మంచి అనుభవం లభిస్తుంది. ఇక Front Camera Video Software విషయానికి వస్తే, Dual Capture, Timelapse మరియు Hyperlapse Modes సపోర్ట్ కూడా ఉన్నాయి.
ఇక Front Camera Other Features విషయానికి వస్తే, అలాగే EIS అంటే Electronic Image Stabilization సపోర్ట్ కూడా ఉంది. ఇక AI Selfie Features విషయానికి వస్తే. Auto Smile Capture, Gesture Selfie, Face Enhance. ఇక Front Camera Other Features విషయానికి వస్తే, Face Retouch, Selfie Animation, Selfie Photo Mirror, Timer, Burst Shot Modes, Assistive Grid మరియు Leveler. Watermark మరియు Location Information. Snap in Video Recording ద్వారా వీడియో తీస్తున్నప్పుడు కూడా ఫోటోలు క్యాప్చర్ చేయవచ్చు. Selfie Stick Support సులభంగా ఉపయోగించవచ్చు.
Audio స్పెసిఫికేషన్స్:-
ఇక Audio విషయానికి వస్తే, ఇందులో Stereo Speakers ఇచ్చారు. Dolby Atmos సపోర్ట్ కూడా ఉంది. అలాగే Hi-Res Audio సపోర్ట్ కూడా ఉంది, కానీ ఇది Wired Audio కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇక Headphone Jack విషయానికి వస్తే, ఇందులో 3.5mm Headset Jack ఇచ్చారు. ఇక Microphones విషయానికి వస్తే, ఇందులో 2 Microphones ఇచ్చారు. దీని వల్ల కాల్స్ సమయంలో వాయిస్ మరింత క్లియర్‌గా క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీడియో రికార్డింగ్ మరియు వీడియో కాల్స్ సమయంలో కూడా ఆడియో క్వాలిటీ మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. ఇక Voice Control విషయానికి వస్తే, ఇందులో Google Gemini సపోర్ట్ ఇచ్చారు. అంటే Google యొక్క లేటెస్ట్ AI Assistant ఫీచర్స్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించవచ్చు.
Connectivity స్పెసిఫికేషన్స్
ఇక Connectivity విషయానికి వస్తే, ఇందులో 5G సపోర్ట్ ఉంది. అలాగే 4G LTE, 3G WCDMA మరియు 2G GSM నెట్‌వర్క్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5G Bands విషయానికి వస్తే, 12 బ్యాండ్స్‌కు సపోర్ట్ ఉంది. అంటే భారతదేశంలో ఉన్న చాలా ప్రధాన 5G నెట్‌వర్క్స్‌తో పని చేసే అవకాశం ఉంది. ఇక Bluetooth విషయానికి వస్తే, ఇందులో Bluetooth 5.4 సపోర్ట్ ఇచ్చారు. ఇక Wi-Fi విషయానికి వస్తే, ఈ ఫోన్ Wi-Fi 802.11 a/b/g/n/ac స్టాండర్డ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2.4GHz మరియు 5GHz Wi-Fi బ్యాండ్స్‌కు సపోర్ట్ ఉంది. అలాగే Wi-Fi Hotspot ఫీచర్ కూడా ఉంది. దీంతో మీ మొబైల్ డేటాను ఇతర డివైసులతో షేర్ చేసుకోవచ్చు. ఇక Location Services విషయానికి వస్తే, ఇందులో GPS, A-GPS, GLONASS, Galileo, QZSS మరియు BeiDou సపోర్ట్ ఉన్నాయి. SIM విషయానికి వస్తే, ఇందులో Dual Nano SIM సపోర్ట్ ఇచ్చారు. అంటే ఒకేసారి రెండు SIM కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు. ఇక NFC విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో NFC సపోర్ట్ లేదు. అయితే సాధారణ డైలీ యూజ్, కాల్స్, సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ వినియోగానికి దీనివల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చు.
In box Details:-
ఇక Box లో ఏమేమి వస్తాయో చూస్తే, Moto G37 Power స్మార్ట్‌ఫోన్, USB Type-C Cable, 📖 User Guides, SIM Eject Tool, TurboPower 33W Fast Charger, అలాగే ఈ ఫోన్ Indiaలో తయారైంది. edi మంచి విషయం అని చెప్పొచ్చు.
