Headlines
Realme Buds Air 8 Pro wireless earbuds in Master Black and Master White color variants with charging case, showcased in a premium 16:9 product design background.

భారతదేశంలో Realme Buds Air 8 Pro విడుదల అయింది. అలాగే మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇప్పుడు వీటి ధర మరియు ఫీచర్లు తెలుసుకుందాం.

Realme Buds Air 8 Pro స్పెసిఫికేషన్స్:

 Realme Buds Air 8 Pro లో కోయాక్షియల్ డ్యూయల్-డ్రైవర్ ఆడియో సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 11mm డైనమిక్ బాస్ డ్రైవర్ మరియు 6mm మైక్రో-ప్లానర్ ట్వీటర్ ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ 20Hz నుంచి 40kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అందిస్తాయని రియల్‌మీ తెలిపింది. దీంతో లో, మిడ్, హై ఫ్రీక్వెన్సీలలో క్లియర్ ఆడియో అనుభవం లభిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 3 మైక్రోఫోన్లు ఉండటంతో మొత్తం 6-మైక్ కాలింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ సెటప్ వాయిస్ క్లారిటీని మెరుగుపరచడంలో మరియు కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.Realme Buds Air 8 Proలో అడాప్టివ్ ANC సపోర్ట్ ఉంది. ఇది గరిష్టంగా 55dB వరకు నాయిస్ రిడక్షన్ అందిస్తుంది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఇచ్చారు. దీంతో ఇయర్‌బడ్స్ తీసేయకుండా చుట్టూ ఉన్న శబ్దాలను వినవచ్చు.

బోన్-కండక్షన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ప్రత్యేక Voice Processing Unit (VPU) కాల్స్ సమయంలో వాయిస్ పికప్‌ను మెరుగుపరుస్తుంది. ఈ సిస్టమ్ పర్యావరణ శబ్దాన్ని 90dB వరకు తగ్గించగలదని కంపెనీ చెబుతోంది. అలాగే AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ మరియు అడాప్టివ్ ఆడియో ఆప్టిమైజేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేక Game Mode ఇచ్చారు. ఇందులో లేటెన్సీ కేవలం 45ms వరకు మాత్రమే ఉంటుంది. అదనంగా Bluetooth 6.1, LHDC 5.0 Hi-Res వైర్‌లెస్ ఆడియో కోడెక్, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, Wear Detection ద్వారా ఆటోమేటిక్ ప్లే/పాజ్, కంపాటిబుల్ Realme స్మార్ట్‌ఫోన్లలో పర్సనలైజ్డ్ పేర్ింగ్ పాప్-అప్స్, అలాగే Android డివైస్‌ల కోసం Google Fast Pair సపోర్ట్ కూడా ఉన్నాయి.

Realme Buds Air 8 Pro కు డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP55 రేటింగ్ ఇచ్చారు. ప్రతి ఇయర్‌బడ్ బరువు సుమారు 4.8 గ్రాములు ఉండగా, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బరువు దాదాపు 53 గ్రాములు ఉంటుంది.

Realme Buds Air 8 Proలో ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. వీటి ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్, కాల్ మేనేజ్‌మెంట్, వాల్యూమ్ అడ్జస్ట్‌మెంట్, అలాగే ANC మరియు ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ల మధ్య స్విచ్ చేయవచ్చు. అదనంగా OTA ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రతి Buds Air 8 Pro ఇయర్‌బడ్‌లో 62mAh బ్యాటరీని రియల్‌మీ అందించింది. ఛార్జింగ్ కేస్‌లో 590mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ సుమారు 12 గంటల వరకు ప్లేబ్యాక్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఈ ఛార్జింగ్ కేస్ USB Type-C పోర్ట్‌తో వస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 11 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందుతుందని రియల్‌మీ తెలిపింది. ఇయర్‌బడ్స్ మరియు ఛార్జింగ్ కేస్ రెండూ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటలు పడుతుంది. కేస్‌లో ఉన్న ఇయర్‌బడ్స్ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది.

Realme Buds Air 8 Pro ధర, అందుబాటు వివరాలు:

భారతదేశంలో Realme Buds Air 8 Pro ధర ₹6,999గా నిర్ణయించారు. కంపెనీ ప్రకారం, లాంచ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు ₹300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ Master White మరియు Master Black కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

వీటి మొదటి సేల్ జూన్ 3 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జూన్ 5 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. Realme Buds Air 8 Proను Flipkart, Amazon, Myntra, Realme అధికారిక వెబ్‌సైట్ మరియు భారతదేశంలోని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Realme Buds Air 8 Pro Details:

  • 55dB అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)
  • 11mm డైనమిక్ బాస్ డ్రైవర్ + 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్
  • డ్యూయల్ DAC ఆడియో సిస్టమ్
  • LHDC 5.0 హై-రెస్ ఆడియో సపోర్ట్
  • Bluetooth 6.1 కనెక్టివిటీ
  • 45ms లో-లేటెన్సీ గేమింగ్ మోడ్
  • ప్రతి ఇయర్‌బడ్‌లో 3 మైక్రోఫోన్లు (మొత్తం 6 మైక్స్)
  • AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ + బోన్ కండక్షన్ VPU
  • SBC / AAC / LHDC ఆడియో కోడెక్ సపోర్ట్
  • మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
  • ఇయర్‌బడ్స్ మాత్రమే 12 గంటల వరకు ప్లేబ్యాక్
  • ప్రతి ఇయర్‌బడ్‌లో 62mAh బ్యాటరీ
  • 590mAh ఛార్జింగ్ కేస్ బ్యాటరీ
  • Type-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 10 నిమిషాల ఛార్జ్‌తో 11 గంటల వరకు ప్లేబ్యాక్
  • IP55 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్
  • డ్యూయల్ / ట్రిపుల్ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్
  • Google Fast Pair సపోర్ట్
  • Wear Detection ఫీచర్
  • కలర్స్: Master Black, Master White
  • ఇండియాలో ధర: ₹6,999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights